10 February 2025
రష్మిక దగ్గరున్న ఖరీదైన వస్తువులు ఇవే.. కార్ కలెక్షన్ చూస్తే..
Rajitha Chanti
Pic credit - Instagram
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది యానిమల్, పుష్ప 2 చిత్రాలతో హిట్స్ అందుకుంది.
రష్మిక దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు గురించి తెలుసుకుందామా. ఆమె దగ్గర బ్లాక్ కలర్ లూయిస్ విట్టన్ బ్యాగ్ ఉంది. దీని ధర రూ.3 లక్షలకు పైగా..
అలాగే ఈ బ్యూటీకి బెంగుళూరులో రూ.8 కోట్ల విలువైన విలాసంతమైన విల్లాను కలిగి ఉంది. అలాగే ముంబైలోనూ ఓ ఇళ్లు ఉన్నట్లు సమాచారం.
రష్మిక దగ్గర రూ.50 లక్షలు విలువైన మెర్సిడెజ్ బెంజ్ సి క్లాస్, రూ.45 లక్షల ఆడి క్యూ3, రేంజ్ రోవర్, టాయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా ఉన్నాయి.
రష్మిక ఫ్యాషన్ ఐకాన్. నిత్యం సరికొత్త లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె వద్ద విలువైన దుస్తులు ఉన్నాయని తెలుసా..
రష్మికకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఆమె వద్ద రూ.82,189 విలువైన తెల్లటి బాలెన్సియాగా హ్యాండ్ బ్యాగ్ సైతం ఉందని తెలుస్తోంది.
నివేదికల ప్రకారం రష్మిక ఆస్తులు రూ.66 కోట్లు. అలాగే ఈ బ్యూటీ తన ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుంది.
అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. రష్మికకు ఇన్ స్టాలో 45.2M ఫాలోవర్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్