04 October 2025

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న రష్మిక.. సంపాదన ఎంతో తెలుసా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం రష్మిక మందన్నా పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

మరోవైపు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగినట్లుగా టాక్. 

అయితే ఈ విషయంపై అటు విజయ్, ఇటు రష్మిక గానీ ఇంతవరకు స్పందించలేదు. వచ్చే ఏడాది వీరిద్దరి వివాహం జరగనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. హిందీ, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది ఈ అమ్మడు.

నివేదికల ప్రకారం రష్మిక ఆస్తులు రూ.50 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషిం తీసుకుంటుందట. 

అలాగే ఈ బ్యూటీ వద్ద రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, థామా, మైసా వంటి చిత్రాల్లో నటిస్తుంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ, సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.