14 October 2025

బుట్టబొమ్మ అందానికి రహస్యం ఇదే.. పూజ హెగ్డే స్కిన్ కేర్ సీక్రెట్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈరోజు ఈ బ్యూటీ 34వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా పూజాకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా పూజా స్కిన్ కేర్, డైట్ సీక్రెట్స్ గురించి తెలుసుకోండి.

పూజా హెగ్డే.. ఎప్పుడూ తక్కువగా మేకప్ వేసుకుంటానని తెలిపింది. ఎంత అలసిపోయిన్పపటికీ తన మేకప్ తొలగించిన తర్వాత ఫేస్  వాష్ చేసి నిద్రపోతుందట.

అలాగే కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం... ఉదయాన్నే ఒక చెంచా కొబ్బరి నూనె తీసుకోవడం తన చర్మానికి మేలు చేస్తుందని గత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మెరిసే చర్మం కోసం పసుపు, క్రీమ్ తో ఫేస్ మాస్క్ ఉపయోగిస్తుందట. అలాగే పొడిబారిన చర్మానికి ప్రతిరోజూ మాయిశ్చరైజర్ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

పూజ కూడా అందానికి మినిమలిస్ట్ విధానాన్ని పాటిస్తుంది. రోజూ యోగా, కఠినమైన వర్కవుట్స్, వ్యాయమాలు చేయడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే తన భోజనంలో పోషకాల అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మకాయ నీరు తీసుకుంటుందట. 

పుష్కలంగా నీరు, గ్రీన్ టీ, డీటాక్స్ డ్రింక్స్ తన చర్మాన్ని హైడ్రెట్ గా ఉంచడానికి సహయపడతాయట. ప్రోటీన్-రిచ్ భోజనం తీసుకోవడానికి ఆమె ఇష్టపడుతుందట.