10 January 2025

12 సినిమాల్లో నటిస్తే 2 సూపర్ హిట్.. బోల్డ్ పాత్రలతోనే సంచలనం..

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో నటిగా రాణించాలంటే ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. 

కానీ తొలి చిత్రంలోనే రొమాంటిక్, బోల్డ్ సన్నివేశాల్లో నటించి సంచలనం సృష్టించింది. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో సెన్సెషన్‎గా మారింది.

కానీ క్రేజ్ వచ్చినప్పటికీ ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రాలేదు. 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్ అయ్యాయి. 

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే అందం, అభినయంతో కుర్రకారును ఆగం చేసింది ఈ ముద్దుగుమ్మ. 

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ బోల్డ్ సీన్లతో రెచ్చిపోయింది. దీంతో క్రేజ్ పెరిగింది. 

అయితే ఈ సినిమా తర్వాత పాయల్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో నెమ్మదిగా అమ్మడు ఫాలోయింగ్ తగ్గింది. 

చిన్న చిన్న చిత్రాల్లో ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఈ బ్యూటీకి సరైన క్రేజ్, బ్రేక్ మాత్రం రావడం లేదు.

ఇటీవలే మంగళవారం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటూ రచ్చ చేస్తుంది.