29 December 2024

ఫస్ట్ మూవీలోనే రొమాంటిక్ సీన్స్‏తో రచ్చలేపింది.. అయినా రాని బ్రేక్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే రొమాంటిక్ సీన్లతో రచ్చలేపింది. 

ఈ బ్యూటీ నటించిన ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది ఈ హీరోయిన్. 

ఇప్పటివరకు తెలుగులో 12 సినిమాల్లో నటించింది. కానీ అందులో రెండు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. సరైన బ్రేక్ కోసం చూస్తుంది.

ఆ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇందులో రెచ్చిపోయి నటించింది. 

మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ హీరోయిన్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ అన్ని నిరాశపరిచాయి. 

చివరగా మంగళవారం అనే సినిమాలో నటించింది పాయల్ రాజ్ పుత్. అంతకు ముందు ఈ బ్యూటీ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. 

మొత్తం పన్నేండు సినిమాల్లో నటించింది పాయల్ రాజ్ పుత్. కానీ అందులో కేవలం రెండు మాత్రమే హిట్టు కావడంతో అవకాశాలు తగ్గాయి. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పాయల్.. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. నిత్యం ఏదోక పోస్ట్ చూస్తూ సందడి చేస్తుంది.