29 September 2025

ఓజీతో బ్లాక్ బస్టర్ హిట్.. ప్రియాంక మోహన్ ఆస్తులు ఎంతంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఓజీ చిత్రం. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ నటించిన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

ఇందులో పవన్ సరసన నటించి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక మోహన్. దక్షిణాదిలో తెలుగు, తమిళం, మలయాళంలో నటించి మెప్పించింది. 

తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఓజీ సినిమాతో ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారు. 

ప్రియాంక నవంబర్ 20, 1995న బెంగళూరులో జన్మించింది. 2019లో కన్నడ సినిమా సంకలనం ఓంధ్ కథే హెల్లాలో అధితి పాత్రలో తొలిసారిగా కనిపించింది. 

న్యాచురల్ స్టార్ నాని సరసన గ్యాంగ్ లీడర్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే డాక్టర్ మూవీతో తమిళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఇప్పుడు ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. నివేదికల ప్రకారం ఈ బ్యూటీ ఆస్తులు రూ.10 కోట్లకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. 

అలాగే ఆమె ఒక్కో సినిమాకు రూ.2 కోట్లకు పైగానే తీసుకుంటుందట. ఆమె వద్ద  ఆడి క్యూ 3, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మంచి కార్లు ఉన్నాయి. 

ప్రియాంకకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచాలని చూస్తుంది. ఆమె అంతగా తెలియజేయదు.