04 October 2025

50 సెకన్ల షూటింగ్ కోసం రూ.5కోట్లు.. హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. కేవలం ఒక యాడ్ కోసం రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందట. 

ఆమె మరెవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తీసుకుంది.

అయితే గతంలో  ఓ కంపెనీకి చెందిన 50 సెకన్ల యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకోవడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

2018లో ఫోర్బ్స్ ఇండియా 'సెలబ్రిటీ 100' జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ప్రముఖ దక్షిణ భారత నటి. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. 

గత 20 సంవత్సరాల్లో 80 చిత్రాల్లో నటించింది. షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' చిత్రంలో నటించడంతో పాన్ ఇండియా హీరోయిన్ గా పాపులర్ అయ్యింది. 

నటించాలనే కోరిక లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నయన్..ఇప్పుడు ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ స్టార్ డమ్ సంపాదించుకుంది.

2015లో 'నానుమ్ రౌడీ థాన్' సినిమా సమయంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. 

ప్రస్తుతం నయన్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఇప్పుడు తెలుగులో మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తుంది.