40 ఏళ్ల వయసులో తగ్గని హావా.. అందంతో పిచ్చెక్కిస్తోన్న వయ్యారి..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. వయసు 40 సంవత్సరాలు. అయినప్పటికీ కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాల్లో టాప్ హీరోయిన్గా అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అటు అందం, ఫిట్నెస్ విషయంలోనూ యంగ్ బ్యూటీలకు గుబులు పుట్టిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. హీరోయిన్ నయనతార. నాలుగు పదుల వయసులో ఈ ముద్దుగుమ్మ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.. ?
నయనతార సమతుల్య ఆహారాన్ని తీసుకుంటుందట. శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారం, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుదట
అలాగే క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తుందట. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు పైలేట్స్, కార్డియో వంటి రకరకాల వ్యాయమాలు చేస్తుందట లేడీ సూపర్ స్టార్.
వ్యాయమంతోపాటు రోజూ యోగా చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి.. శరీరానికి, మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. బిజీ షెడ్యుల్ ఉన్నప్పటికీ యోగా చేయడం ఆపదు.
ఫిట్నెస్ అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదని.. మానసిక శ్రేయస్సు అంటుంది నయన్. ఒత్తిడిని తగ్గించుకోవడానికి తాను తీసుకునే ఆహారంపై దృష్టి పెడుతుందట
ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. అమె కచ్చితంగా ఎక్కువ గంటలు విశ్రాంతి తీసుకుంటుంది. కఠినమైన పని షెడ్యూల్ ఉన్నా.. శరీరానికి తగినంత విశ్రాంతి తీసుకుంటుందట.