నాగ చైతన్య కార్ కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంకే.. ఆస్తులు ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.
చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చైతూ ఆస్తి వివరాలు వైరలవుతున్నాయి.
నివేదికల ప్రకారం అక్కినేని నాగచైతన్య రూ.154 కోట్లు అని సమాచారం. అలాగే ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారట.
అలాగే 2022లో హైదరాబాద్‌లో గౌర్మెట్ ఆగ్నేయాసియా వంటకాలలో ప్రత్యేకత కలిగిన షోయు అనే క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించారు చైతన్య.
చైతన్య బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో కూడా పాల్గొంటాడు. జూబ్లీ హిల్స్‌లో రూ. 15 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
అలాగే చైతూకు ఆటో మొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువ. అతడి వద్ద ఫెరారీ F430, మెర్సిడెస్ బెంజ్ G-క్లాస్ G63, ఎరుపు రంగు నిస్సాన్ GT-R వంటి హై-ఎండ్ మోడల్స్ ఉన్నాయి .
ఫెరారీ F430 విలువ దాదాపు INR 1.75 కోట్లు కాగా, G-క్లాస్ G63 ధర దాదాపు కోటి రూపాయలు. నిస్సాన్ GT-R దాదాపు 2.12 కోట్లు ఉంటుంది.
చైతన్య బైక్ కలెక్షన్ కూడా ఆకట్టుకుంటుంది. రూ.25 లక్షల విలువైన ఎరుపు రంగు MV అగస్టా F4, రూ. 19.3 లక్షల విలువైన BMW R9T ఉన్నాయి.