ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఎవరో తెలుసా..
Rajitha Chanti
Pic credit - Instagram
ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని స్టార్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో.
భారతీయ సినీ పరిశ్రమలోనే మొదటిసారిగా ఒకే చిత్రానికి రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి.
1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్ ఫస్ట్ పేజీలో చిరు గురించి స్పెషల్ స్టోరీ రాశారు. ముందు పేజీలో "బచ్చన్ కంటే పెద్దది" అనే శీర్షికతో చిరు ఫోటోను ప్రింట్ చేశారు.
అంతేకాదు.. అప్పట్లో తెలుగు "ఆపద్బాంధవుడు" ఎలైట్ లీగ్ లో చేర్చింది. ఈ సినిమా కోసం చిరు తీసుకున్న పారితోషికం రూ.1 కోటి.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా నిలిచారు చిరంజీవి. అప్పట్లో అమితాబ్ ఒక్కో సినిమాకు రూ.90 లక్షలు తీసుకుంటున్నాడు.
అంతకు మించి రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిరు కావడం విశేషం. 80వ దశకంలో సినీ ప్రయాణం ఆరంభించారు చిరంజీవి. మొదట్లో విలన్ రోల్స్ చేశారు.
పునాది రాళ్లు సినిమాతో హీరోగా మారాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్ద కాలంలోనే నెంబర్ వన్ హీరోగా నిలిచాడు.
చిరంజీవి తర్వాత కమల్ హాసన్ 1994లో ఒక్క సినిమాకు కోటి పారితోషికం తీసుకున్నారు. 1990ల చివరినాటికి ఒక్కో సినిమాకు కోటి తీసుకున్నారు.