19 January 2024

ఏడాదికి  మహేష్ బాబు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే

TV9 Telugu

గుంటూరు కారం సినిమాతో మరోసారి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

మహేష్.. ఇప్పటివరకు 25 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి మెప్పించాడు.

రీసెంట్‌గా గుంటూరు కారం సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ అందుకున్న మహేష్.. అటు బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆయన ఒకరు.

జీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్, హైదరాబాద్ గచ్చిబౌలిలో సెవెన్ స్క్రీన్ మల్టీప్లెక్స్, ఏఎమ్బీ సినిమాస్ కూడా ఉన్నాయి.

CNBC నివేదిక.. మహేష్ ఆస్తుల విలువను దాదాపుగా 273 కోట్లుగా అంచనా వేసింది.

అలాగే నెలకు 2 కోట్లు.. సంవత్సరానికి 120 కోట్లు వరకు సంపాదిస్తాడని తమ రిపోర్టులో కోట్ చేసింది.