09 February 2024

మహేష్ బాబు ఫిట్‏నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా ?.. ఇంత సింపులా.. 

TV9 Telugu

Pic credit - Instagram

ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్. ఇక ఇప్పుడు రాజమౌళి రూపొందించే ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. 

ఇందులో సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. ఆయన  ఫిట్, టోన్డ్ ఫిజిక్‌తో ఎప్పటికప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. స్టైలీష్ అండ్ డాషింగ్ లుక్‏లో కనిపిస్తుంటారు. 

48 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. అందుకే ఆయన అనుసరించే వర్కవుట్, డైట్ ప్లాన్స్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. 

ఉదయాన్నే మహేష్.. రాత్రిపూట నానబెట్టిన విత్తనాలు, ఓట్స్ తో చేసిన ఆహారం తీసుకుంటున్నారు. గతంలో మహేష్ తన ఇన్ స్టాలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటో షేర్ చేశారు. 

అలాగే రోజూ కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటారు. రోజూ.. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫంక్షనల్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తుంటారు.

అలాగే.. యోగా, ధ్యానం చేస్తుంటారు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వంటి అన్ని అవసరమైన పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకుంటారని తెలుస్తోంది. 

ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటారు. ఇంట్లో చేసిన ఆహారపదార్థాలను మాత్రమే తీసుకుంటారు.  అలాగే మహేష్ తన జిమ్ వర్కవుట్స్ ఫోటోస్ షేర్ చేస్తుంటారు. 

ఆహారంలో లీన్ మాంసాలు, చేపలు, కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు ఉండేలా చూసుకుంటారు. మహేష్ బాబు త్వరలోనే జక్కన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు.