19 August 2025

ప్రతి సంవత్సరం రూ.30 కోట్లు దానం చేసే తెలుగు హీరో.. ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగులో క్రేజీ హీరో. ప్రస్తుతం ఆయన వయసు 50 సంవత్సరాలు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు.

కానీ మీకు తెలుసా.. అతడు ప్రతి సంవత్సరం చిన్నారుల ఆరోగ్యం కోసం, పేద ప్రజల కోసం దాదాపు రూ.30 కోట్లు దానం చేస్తారు.

ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. దక్షిణాదిలో ఇంతపెద్ద మొత్తంలో విరాళం ప్రకటించే ఏకైక హీరో ఆయనే కావడం విశేషం.

ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరోవైపు సామాజిక సేవ చేయడంలో మహేష్ బాబు ముందుంటారు.

ఆయన ప్రతి ఏడాది చిన్నారుల గుండె ఆపరేషన్స్ కోసం, పేదల కోసం రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు విరాళం అందిస్తాడు.

ఆయన అనేక స్వచ్చంద సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నారు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ద్వారా పేద పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. 

ఏపీలో బూరిపాలెం గ్రామాన్ని, తెలంగాణంలోని సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ ఎన్నో సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేశారు.

ఇప్పటివరకు 4500లకు పైగా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయించారు. మహేష్ ఆస్తుల విలువ రూ.135 కోట్లు అని సమాచారం.