12 December 2024

మహానటి రేంజ్ ఇది.. కీర్తి ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. 

బాలనటిగా సినీరంగంలో అడుగుపెట్టిన కీర్తి.. ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‏గా మారింది. 

2013లో మలయాళంలో గీతాంజలి మూవీ ద్వారా హీరోయిన్‏గా మారిన కీర్తి.. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

నివేదికల ప్రకారం ఇప్పటివరకు కీర్తి సురేష్ ఆస్తులు రూ.41 కోట్లు. ఏడాదికి రూ.35 లక్షల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.

ఒక్కో సినిమాకు దాదాపు రూ.4 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. ప్రకటనలు, బ్రాండ్ డీల్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా సంపాదిస్తుంది. 

ప్రతి ఎండార్స్‌మెంట్‌కి రూ.30 లక్షల వరకు వసూలు చేసిందని టాక్. ఇన్ స్టాలో పోస్ట్ చేసే ప్రతి పోస్టుకు రూ.25 లక్షల వరకు తీసుకుంటుంది. 

కీర్తి సురేష్ చెన్నైలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‏లో ఆమెకు ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. 

డిసెంబర్ 12న కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని పెళ్లి చేసుకోనుంది. వీరిద్దరి పెళ్లి గోవాలో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో జరగనుంది.