08 October 2025
కాంతార బ్యూటీ అందం రహస్యం ఇదేనట.. రుక్మిణి వసంత్ ఏం చెప్పిందంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
కాంతార చాప్టర్ 1 సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది కన్నడ భామ రుక్మిణి వసంత్. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ అమ్మాడి పేరే వినిపిస్తుంది.
అంతకు ముందు సప్త సాగరాలు దాటి సినిమాతో దక్షిణాదిలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం తెలుగు, కన్నడలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాంతార 1 చిత్రంలో రుక్మిణి వసంత్ మేకోవర్స్, స్టైలీష్ లుక్స్ జనాలను ఆకట్టుకున్నాయి. అందంతోపాటు అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ.
ఇక ఇప్పుడు రుక్మిణి వసంత్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే తన డైట్, లైఫ్ స్టైల్ కు సంబంధించి పలు విషయాలు చెప్పుకొచ్చింది.
ప్రతిరోజూ యోగ, డ్యాన్స్ చేస్తానని.. ముఖ్యంగా రోజూ కొబ్బరి నీళ్లు తీసుకుంటుందట. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తుందట.
రుక్మిణి తండ్రి పేరు కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్, సిక్కిం రీజియన్ లలో సేవలందించారు.
2007లో ఉరి సెక్టార్ వద్ద ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందారు. రుక్మిణి వసంత్ తండ్రి గురించి తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్