11 October 2025

తల్లైనా తగ్గని అందం.. కాజల్ ఫిట్నెస్ రహస్యం చెప్పేసిందిగా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

కొన్నాళ్ల క్రితం తెలుగు టాప్ హీరోయిన్లలో కాజల్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్స్ అందుకుంది.

కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. వీరికి బాబు నీల్ కిచ్లూ ఉన్నాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది.

పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న కాజల్.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. అలాగే తల్లైనా తరగని అందంతో కుర్ర భామలకు పోటీ ఇస్తుంది. 

ఈ క్రమంలో తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసింది కాజల్. తన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్, హైడ్రేషన్, సీరం యూజ్ చేస్తుందట. 

రాత్రిళ్లు చర్మానికి సీరమ్ అప్లై చేస్తుందట. సినిమా షూటింగ్, ఫ్యామిలీ బాధ్యతలు ఉన్నప్పటికీ తన డైట్, ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం ఉండదని తెలిపింది.

ప్రతి రోజూ యోగా చేయడంతోపాటు కఠినమైన వర్కవుట్స్ చేస్తుందట. శరీరాన్ని ఎక్కువగా కదిలించడానికి ఆమె ఎక్కువగా జిమ్ లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తుందట. 

ఆమె తన ఆహారంలోకి కచ్చితంగా పండ్లు, ఆకుకూరలు, గింజలు, కొబ్బరి నీరు తీసుకుంటుంది. ఆకుకూరలలో పోషకాలు అధికంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. 

కోబ్బరి నీరు తనను హైడ్రేటెడ్ గా ఉంచుతుందని.. నిత్యం తనను రిఫ్రెషర్ గా చేస్తుందని చెప్పుకొచ్చింది. తన ఫిట్నెస్, డైట్ పై నిత్యం శ్రద్ధ తీసుకుంటానని చెప్పుకొచ్చింది కాజల్.