37 ఏళ్ల వయసులో తరగని అందం.. జనీలియా ఆస్తులు ఎంతో తెలుసా.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన జెనీలియా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించింది.
ముంబైలో జన్మించిన జెనీలియా డిసౌజా పాఠశాల సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయి అథ్లెట్, జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి. పార్కర్ పెన్ ప్రకటనలో తొలిసారి కనిపించింది.
తుఝే మేరీ కసమ్ (2003) సినిమాతో సినీరంగంలోకి నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
జెనీలియా దక్షిణాది సూపర్‌స్టార్‌లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సిద్ధార్థ్‌లతో కలిసి పనిచేశారు. తెలుగులో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
2012లో తన తొలి సహనటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది.
చాలా కాలం తర్వాత వేద్ సినిమాతో సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది. అలాగే 2025లో అమీర్ ఖాన్ తో కలిసి సీతారే జమీన్ పర్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.
ఇక ఇటీవలే జూనియర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.140 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యింది.