18 February 2025

19 ఏళ్లకే హీరోయిన్.. అనుపమ ఆస్తులు తెలిస్తే గుండె గుభేల్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

19 ఏళ్ల వయసులోనే ప్రేమమ్ సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే అందంతో కుర్రకారును కట్టిపడేసింది.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 

ఈరోజు (ఫిబ్రవరి 18న) అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు ఫ్యాన్స్, సెలబ్రెటీస్ విషెస్ తెలుపుతున్నారు.

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె ఒక్క సినిమాకు కోటి వసూలు చేస్తుంది. 

నివేదికల ప్రకారం అనుపమ ఆస్తులు రూ.35 కోట్లకు పైగా ఉన్నాయని సమాచారం. అలాగే లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనం ఉందని టాక్. 

రొమాంటిక్ చిత్రాల్లో నటించాలంటే అనుపమ రూ.1.50 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అలాగే ఒక్క ప్రకటనకు రూ.50 లక్షలు ఛార్జ్ చేస్తుందట. 

అనుపమ సినీరంగంలోకి అడుగుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది.  ఇన్నేళ్లలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 

సినిమాల గురించి కాకుండా అనుపమ వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రావట్లేదు.