05 October 2025

అనుపమ ఆస్తులు ఎంతో తెలుసా.. ? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది.

ఇటీవలే కిష్కంధపురి, పరదా చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు చిత్రాలకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

మరోవైపు సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తుంది. కేరళలోని ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. ప్రేమమ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది.

సినిమాల్లోకి రాకముందు ఆమె ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంటుంది ఈ కేరళ కుట్టి. 

అనుపమ పరమేశ్వరన్ ఎక్కువగా వివాదాలకు దూరంగా ఉన్నారు. కానీ కొన్ని రోజులుగా అనుపమకు సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. 

నివేదికల ప్రకారం అనుపమ పరమేశ్వరన్ ఆస్తుల విలువ రూ.40 కోట్లు. ఆమె ఒక్కో సినిమాకు ఒక కోటి కంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటుందని టాక్.

మరోవైపు అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.