టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన జెనీలియా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించింది.
కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది శ్రీముఖి. ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో బ్రేక్ రాలేదు.
ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే గ్లామరస్ యాంకర్ గానూ క్రేజ్ సొంతం చేసుకుంది.
బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది. తన ఆట తీరుతో ఆకట్టుకుంది. అప్పట్లో బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖి అవుతుందని భావించినప్పటికీ రన్నరప్ గా నిలిచింది.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం వరుస ఫోటోషూట్లతో అలరించే శ్రీముఖి.. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో అందంగా కట్టిపడేస్తుంది.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఫోటోషూట్స్, పర్సనల్ విషయాల గురించి పోస్టులు చేస్తూ నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటుంది.
అయితే నివేదికల ప్రకారం శ్రీముఖి ఆస్తులు రూ.25 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్స్, బుల్లితెరపై పలు షోస్, సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి సంపాదిస్తుంది.
శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్. ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయిన శ్రీముఖి తన కామెడీ టైమింగ్, వాక్చాతుర్యంతో యాంకర్ గా సక్సెస్ అయ్యింది. హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.