01 March 2025

ఇంటర్ కూడా చదవలేదు.. కోట్ల ఆస్తులకు యాజమాని.. ఈ హీరోయిన్ ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

కనీసం ఇంటర్ కూడా పూర్తి చేయని ఈ హీరోయిన్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ బ్యూటీ. అంతేకాదు కోట్లాది ఆస్తులకు యజమాని కూడా. 

సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. 

మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొన్నాళ్ల క్రితం ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సొంతం చేసుకుంది. 

ఆమె మరెవరో కాదు.. అలియా భట్. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తెరంగేట్రం చేసింది అలియా.

ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో అలియాకు వరుస ఆఫర్స్ వచ్చాయి. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుని ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. 

అలియా 12వ తరగతి మధ్యలోనే మానేసి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నివేదికల ప్రకారం అలియా ఆస్తులు ఏకంగా రూ.550  కోట్లకు పైగా. 

అలాగే 2020లో అలియా సొంతం సన్ షైన్ ప్రొడక్షన్స్ హౌస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. తన సొంత నిర్మాణ సంస్థలో ఎన్నో చిత్రాలను నిర్మించింది. 

అలాగే అటు వ్యాపారరంగంలోనూ భారీగా సంపాదిస్తుంది. అనేక రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.9 కోట్లు తీసుకుందట.