01 February 2025

అజిత్ దగ్గరున్న ఖరీదైన వస్తువులు ఇవే.. కార్ కలెక్షన్స్ చూస్తే..

Rajitha Chanti

Pic credit - Instagram

కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన 24H 2025 కార్ రేసింగ్ ఈవెంట్‏లో తన టీంతో కలిసి 991 విభాగంలో మూడవ స్థానం సాధించిన విషయం తెలిసిందే.

అతను 2003 ఫార్ములా ఆసియా BMW ఛాంపియన్‌షిప్‌లు, 2010 ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్‌లలో పాల్గొన్నాడు.

అజిత్ కుమార్ నికర విలువ రూ. 350 కోట్లు. ప్రస్తుతం అతడి వయసు 53 ఏళ్లు. ఇప్పటివరకు తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. 

ఫెరారీ SF90 నుండి పోర్షే GT3 RS వరకు, అజిత్ కుమార్ తన గ్యారేజీలో అనేక ఖరీదైన లగ్జరీ కార్లను పార్క్ చేసాడు. అతడికి ఆటోమొబైల్స్ పై ఆసక్తి.

అజిత్ వద్ద  రూ. 3.51 కోట్ల విలువైన పోర్షే GT3, రూ. 9 కోట్ల విలువైన  ఫెరారీ, రూ. 1.5 కోట్లు విలువైన BMW 740Li కార్లు ఉన్నట్లు సమాచారం. 

మెర్సిడెస్-బెంజ్ 350 GLS కలిగి ఉన్నాడు. దీని ధర రూ.1.35 కోట్లు. అజిత్ కుమార్ ఖరీదైన లంబోర్ఘినిని కలిగి ఉన్నాడని తెలుస్తోంది. 

ప్రస్తుతం అజిత్ నటించిన విడుదల, గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.