12 February 2025

స్టార్ హీరో కూతురు.. అందంగా లేవంటూ విమర్శలు.. కట్ చేస్తే..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే తెలుగు చిత్రపరిశ్రమలో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

ఆమె తండ్రి ఒకప్పుడు స్టార్ హీరో. అయినా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఒకప్పుడు తన ముఖంపైనే దర్శకనిర్మాతలు అవమానించారని తెలిపింది.

కానీ ఇప్పుడు తన సహజ నటనతో అందరిని కట్టిపడేసింది. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి మరణం.. కుటుంబం ఆర్థిక సమస్యలతో కష్టాలు చూసింది ఈ హీరోయిన్.

ఆమె మరెవరో కాదు.. ఐశ్వర్య రాజేష్. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో భాగ్యం పాత్రలో అద్భుతమైన నటనతో నటిగా ప్రశంసలు అందుకుంది.

ఒకప్పటి తెలుగు హీరో రాజేష్ కూతురే ఐశ్వర్య రాజేష్. తల్లి డ్యాన్సర్. ఐశ్వర్యకు ఎనిమిదేళ్ల వయసులోనే తన తండ్రి కాలేయ వ్యాధితో మరణించాడు. 

మంచి ఉద్యోగం చేసి తల్లిని బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నానని.. ఇప్పుడు తన సినిమాలు చూసి అమ్మ సంతోషంగా ఉందని తెలిపింది. 

కెరీర్ తొలినాళ్లలో దర్శకనిర్మాతలను తనను ముఖం మీదే అవమానించారని.. జూనియర్ ఆర్టిస్టుగా కూడా పనికిరావని అన్నారని గుర్తు చేసుకుంది ఐశ్వర్య. 

కానీ ఇప్పుడు అందం, అభినయంతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. భాగ్యం పాత్రలతో తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది.