47 ఏళ్ల వయసులో తరగని అందం.. అదితి స్కిన్, ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో అదితి రావు హైదరీ ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 47 సంవత్సరాలు. ఇప్పటికీ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది.
అదితి రావు హైదరీ స్కిన్, ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందామా. ఆమె రోజు ఉదయం స్ట్రాబెర్రీలు, అవకాడో, చెర్రీస్, పీచ్ వంటి వివిధ రకాల పండ్లతో రోజు స్టార్ట్ చేస్తుంది.
అలాగే ఇడ్లీ పోహా, గుడ్లు వంటి ఆహారాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంది. ఈ ఆహారాలు త్వరగా జీర్ణం కావడం.. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉందనే భావన కలిగిస్తాయి.
మధ్యాహ్న భోజనంలో ఆమె సాధారణంగా అన్నం, పప్పు, చేపలు, చికెన్ లేదా మటన్ వంటి ప్రోటీన్లతో కూడిన క్వినోవా తింటుంది. దీంతో సమతుల్య పోషకమైన ఆహారం లభిస్తుంది.
అదితి తన ఆహారంలో కొద్ది మొత్తంలో దేశీ నెయ్యిని కూడా కలుపుకుంటుంది. దేశీ నెయ్యి మీ చర్మానికి, జీర్ణక్రియకు మంచిది. అలాగే రోజూ యోగా చేయడం చాలా ముఖ్యమని అంటుంది.
రోజూ యోగా చేయడం వల్ల శరీరాన్ని టోన్‌గా ఉంచుకోవడానికి సహయపడుతుంది. అలాగే శరీరాకృతి మారడం, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు యోగా మంచి అలవాటు.
చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి హైడ్రేషన్ ముఖ్యం. అదితి రావు హైదరి పుష్కలంగా నీరు త్రాగుతుంది. దోసకాయలు, పుచ్చకాయ వంటి జ్యుసి ఆహారాలు తీసుకుంటుంది.
అదితి రావు హైదరి ఎలాంటి క్రాష్ డైట్‌లను పాటించదు. ఆమె తన ఆహారాన్ని ఆస్వాదించడానికి, సహజంగా ఫిట్‌గా ఉండటానికి ఆమె ప్రతిదీ మితంగా తింటుంది.