16 November 2025

అదితి ఆస్తులు ఎంతంటే..  సిద్థార్థ్ కంటే ఎక్కువా..? తక్కువా.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

భారతీయ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితి రావు హైదరి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించింది.

ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే హీరో సిద్ధార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితి.. తాజాగా తన పేరుతో నెట్టింట జరుగుతున్న మోసం పై స్పందించింది. దీంతో ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. 

ఇదెలా ఉంటే.. సినీ పరిశ్రమలో దశాబ్దన్నర కాలంగా యాక్టివ్ గా ఉంటూ అనేక హిట్ చిత్రాల్లో నటిస్తుంది అదితి. ఇంతకీ ఆమె ఆస్తులు ఎంతంటే..

నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.62 కోట్లకు పైగా ఉన్నాయని సమాచారం. అలాగే ఆమె భర్త సిద్ధార్థ్ ఆస్తులు దాదాపు 70 కోట్లకు పైగానే ఉన్నాయట.

అదితి, సిద్ధార్థ్ ల మొత్తం ఆస్తులు రూ.130 కోట్లకు పైగా ఉంది. అలాగే వారిద్దరికి రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, ఆడి A4 వంటి కార్లు ఉన్నాయి.

హైదరాబాద్, చెన్నై,  ముంబైలలో ఆస్తులను కలిగి ఉన్నాడు సిద్ధార్థ్. అయితే ప్రస్తుతం తమిళంలో విభిన్న కంటెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం అదితికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.