08 December 2024

2024లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్.. ఎవరంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

దాదాపు 20 ఏళ్లుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో తనదైన నటనతో మెప్పిస్తోంది. ఇప్పటికీ టాప్ హీరోయిన్‏గా దూసుకుపోతుంది. ఎవరో తెలుసా..? 

ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. కొన్నాళ్లు గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మరోసారి దూసుకుపోతుంది. తనే హీరోయిన్ త్రిష. 

ఈ ఏడాది చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది హీరోయిన్ త్రిష. అంతేకాదు.. 2024లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‏గా నిలిచింది. 

అందం, అభినయంతో కట్టిపడేస్తోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదుంది. 20 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసిన త్రిష.. ఇప్పటికీ జోరు కొనసాగిస్తుంది. 

2002లో అమీర్ దర్శకత్వం వహించిన మౌనం పసియతే సినిమాతో కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఇందులో సూర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. 

కొన్నాళ్ల క్రితం మార్కెట్ పడిపోయి సరైన సినిమా అవకాశాలు రాకపోయినా 96తో యాక్షన్ కమ్ బ్యాక్ ఇచ్చింది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో హిట్ అందుకుంది. 

ఆ తర్వాత విజయ్ సరసన లియో సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర, అజిత్ జోడిగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తుంది. 

ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. దీంతో  సౌత్ ఇండియన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా త్రిష నిలిచింది.