11 April 2025
ఒక్క సినిమాకు రూ.12 కోట్లు.. 41 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతుంది ఈ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది.
41 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు సైతం గట్టిపోటీనిస్తుంది. అంతేకాదు ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు తీసుకుంటుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ త్రిష. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. దాదాపు 20 ఏళ్లుగా నటిస్తోంది.
కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న త్రిష.. ఇప్పుడు మాత్రం క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.
పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన త్రిష.. తమిళంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అలాగే చిరంజీవితో విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.
ఇవే కాకుండా తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ అమ్మడుకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రతి సినిమాకు రూ.12 కోట్లు తీసుకుంటుంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్