29 October 2024

ఒక్క సినిమాతో మారిన క్రేజ్.. 40 లక్షల నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం నేషనల్ సెన్సెషనల్ అయిన హీరోయిన్ త్రిప్తి దిమ్రి తన రెమ్యునరేషన్ రూ.40 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచేసింది. 

'మామ్' అనే థ్రిల్లర్ సినిమాతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన త్రిప్తి దిమ్రీ.. లైలా మజ్ను సినిమాతో హీరోయిన్‌గా మారింది. 

ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'బుల్బుల్' వంటి చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించింది. 2023లో హిట్టైన యానిమల్ చిత్రంలో మెరిసింది.

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీలో కీలకపాత్ర పోషించింది హీరోయిన్ త్రిప్తి. 

సినిమాలో మొత్తం సీన్లు అరగంట మాత్రమే ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ లేనంతగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇన్ స్టాలో ఫాలోయింగ్ పెరిగిం

యానిమల్ చిత్రంలో నటించినందుకు త్రిప్తి రూ.45 లక్షలు అందుకుంది. ఆ తర్వాత విక్కీ కౌశల్ సరసన 'బాడ్ న్యూస్' చిత్రంలో నటించింది. 

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విమర్శకుల ప్రశంసలు రావడంతో ఈ చిత్రంతో తన రెమ్యునరేషన్ రూ.80 లక్షలు చేసింది.

ఇక ఇటీవల వచ్చిన బ్యాడ్ న్యూజ్ సినిమాకు రూ.6 కోట్ల పారితోషికం తీసుకన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.