08 December 2024

అప్పుడు షాపింగ్ మాల్స్‏లో పనిచేసి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ ఫాలోయింగ్

Rajitha Chanti

Pic credit - Instagram

సినీరంగుల ప్రపంచంలో ఇప్పుడు టాప్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె నటనకు సినీ ప్రముఖులు, విమర్శకులు సైతం ముగ్దులయ్యారు. 

అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా హాలీవుడ్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తనే హీరోయిన్ సమంత. 

పాకెట్ మనీ కోసం మోడలింగ్ స్టార్ట్ చేసిన సామ్ ఆ తర్వాత కథానాయికగా మారిందట. ఈ విషయాన్ని గతంలో అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చింది. 

 పాకెట్ మనీ కోసం చెన్నైలో మోడలింగ్ చేశానని.. అప్పట్లో తనకు చీరల షాపింగ్ మాల్స్ నుంచి ఎక్కువగా యాడ్స్ వచ్చేవని చెప్పుకొచ్చంది సామ్. 

కాలేజీ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాలనే తన డ్రీమ్ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల జరగలేదని.. కాలేజీ తర్వాత ఒక ఏడాది ఖాళీగా ఉన్నప్పుడు మోడలింగ్ ఆఫర్ వచ్చిందట. 

మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిందట సామ్. ఏమాయ చేసావే సినిమా తెలుగు తెరకు పరిచయమైంది సామ్. 

తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత అటు మానసిక సంఘర్షణ, ఇటు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది. 

మయోసైటిస్ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్.. ఇటీవల సిటాడెల్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చి మరోసారి నటనతో మెప్పించింది.