19 January 2025
ఒకప్పుడు న్యూస్ యాంకర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.
కానీ సినీరంగంలోకి అడుగుపెట్టకముందు ఓ ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేసింది. అలాగే పలు రియాల్టీ షోలకు యాంకరింగ్ చేసింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత కథానాయికగా అవకాశాలు అందుకుని.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారింది.
ఆ బ్యూటీ మరెవరో కాదండి.. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. 1989లో తమిళనాడులో జన్మించింది. మొదట్లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేసింది.
బుల్లితెరపై పలు సీరియల్లలో మెయిన్ లీడ్ రోల్ పోషించింది. వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది.
మొదటి సినిమాకే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ఆఫర్స్ క్యూ కట్టాయి.
కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన కడై కుట్టి సింగం సినిమాలో నటించింది. అలాగే ఎస్జే సూర్య సరసన మాన్ స్టర్ చిత్రంలో నటించి మెప్పించింది.
కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియా.. దూత వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్