06 February 2025
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ అమ్మాయి.. సినీరంగుల ప్రపంచంలో నటిగా మారాలని ఎన్నో కలలతో ముంబై చేరింది.
కెరీర్ తొలినాళ్లలో బుల్లితెరపై పలు సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది.
ఒకప్పుడు టీవీల్లో సీరియల్స్ చేసిన ఆ అమ్మాయి.. ఇప్పుడు సినీరంగంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కుర్రాళ్ల ఫాలోయింగ్ తెచ్చుకుంది.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారు.. ? తనే బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ సంచలనం.
నాగిని సీరియల్ ద్వారా అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.
కెరీర్ మొదట్లో ఆమె బ్యాగ్రౌండ్ డ్యాన్సర్. అభిషేక్ బచ్చన్, భూమికా చావ్లా కలిసి నటించిన రన్ చిత్రంలో మౌని రాయ్ మొదట డాన్సర్‌గా కనిపించింది.
తక్కువ సమయంలోనే తన డ్యాన్స్, అందంతో అభిమానులను సంపాదించుకుంది. నాగిన్ తర్వాత మరిన్ని సీరియల్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం మౌనీ రాయ్ కు నార్త్, సౌత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్