19 April 2025
చైనాలో ఎంబీబీఎస్ డాక్టర్.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో ఇప్పుడిప్పుడే హీరోయిన్గా అవకాశాలు అందుకుంటుంది ఈ హీరోయిన్. ఢీ గ్లామర్ పాత్రలతోనే నటిగా ప్రశంసలు అందుకుంటుంది.
అయితే సినిమాల్లో ఢీ గ్లామర్, రగ్గడ్ క్యారెక్టర్స్ పోషిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది ఈ వయ్యారి.
చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. కొన్నాళ్లపాటు అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు అందించింది. కట్ చేస్తే. ఇప్పుడు ఇండస్ట్రీ హీరోయిన్.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మన తెలుగమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్‌గా కొన్నాళ్లు పనిచేసింది.
ఆ తర్వాత 2018లో మిస్ తెలంగాణగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. ప్రియురాలు సినిమాతో పరిచయమైంది.
తెలుగులో మా ఊరి పొలిమేర, ఇట్లు మారేడుమిల్లు ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 22, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
అలాగే ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ చేసింది కామాక్షి భాస్కర్ల. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ నటిగా రాణిస్తుంది.
ఓవైపు చేతినిండా సినిమాలు.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో సెగలు పుట్టిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్