21 January 2025

కాలేజీలో బాడీ షేమింగ్.. రొమాంటిక్ సీన్స్‏తో మెంటలెక్కించిన చిన్నది

Rajitha Chanti

Pic credit - Instagram

కన్నడ చిత్రపరిశ్రమలో మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తొలి చిత్రంలోని రొమాంటిక్ సీన్లతో రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ

కాలేజీలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఆమె ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీశాయి. కానీ ఇప్పుడు దక్షిణాదిలో అందం, అభినయంతో మెప్పిస్తుంది ఈ వయ్యారి.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారు. తనే హీరోయిన్ దివ్య భారతి. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

కోయంబత్తూరుకు చెందిన ఈ వయ్యారి కాలేజీ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కించిన బ్యాచిలర్ చిత్రంలో నటించింది. ఈ మూవీలో రొమాంటిక్ సీన్లతో కుర్రకారుకు మెంటలెక్కించింది.

ఆ తర్వాత బిగ్ బాస్ ముగెన్ రావు సరసన మదిల్ మెయిల్ కాదల్ అనే చిత్రంలో నటించింది. కాలేజీలో తనకు ఎదురైన అవమానాలను చెప్పుకొచ్చింది.

పాండా బాటిల్, అస్థి మంజరం అంటూ తనను బాడీ షేమింగ్ చేసేవారని.. ఆ మాటలు తన శరీరాన్ని ద్వేషించేలా చేశాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

ప్రజల ముందుకు నడవడానికి సైతం భయపడ్డానని.. 2015లో ఇన్ స్టాలో తన ఫోటోస్ షేర్ చేస్తే వచ్చిన కామెంట్స్ చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపింది.