08 December 2024

హీరో సూర్య ఆస్తులు తెలిస్తే షాకే.. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

హీరో సూర్యకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీలో ఈ హీరోకు భారీగా అభిమానులు ఉన్నారు. 

1990లో సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు సూర్య. ఆ తర్వాత 2001లో నందా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. 

గజిని, సింగ, సూరరై పొట్రు, జైభీమ్ వంటి హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. ఇటీవలే కంగువ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. 

ప్రస్తుతం సూర్య 44వ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇందులో సూర్య సరసన హీరోయిన్ త్రిషను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. 

సూర్య ఆస్తుల విషయానికి వస్తే.. నివేదికల ప్రకారం రూ.350 కోట్లు. అలాగే నిర్మాణ సంస్థలు, సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా సంపాదిస్తున్నాడు. 

సూర్య, అతడి భార్య జ్యోతిక మొత్తం ఆస్తులు కలిపితే రూ.500 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. సూర్య ఒక్కో సినిమాకు 25 కోట్లు తీసుకుంటాడు. 

సూర్యకు 2D ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో నిర్మాణ సంస్థ ఉంది. అతడి వద్ద ఆడి, BMW వంటి లగ్జరీ కార్లు ఉన్నాడు. చెన్నైలో విలాసవంతమైన ఇల్లు ఉంది. 

అలాగే ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇల్లు విలువ దాదాపు రూ.70 కోట్లు ఉంటుంది. శరవణన్ శివకుమార్ అగరం ఫౌండేషన్‌ ద్వారా పేదలకు సాయం చేస్తున్నాడు.