04 July 2025

అసిస్టెంట్ డైరెక్టర్‏గా నాని ఫస్ట్ జీతం ఎంతో తెలుసా..? ఇప్పుడు ఇలా

Rajitha Chanti

Pic credit - Instagram

న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పక్కర్లేదు. పక్కింటి అబ్బాయిగా కనిపిస్తూనే సహజ నటనతో కట్టిపడేస్తుంటారు.

కానీ మీకు తెలుసా..? నాని మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ప్రారంభించిన నాని.. ఆ తర్వాత అష్టా చెమ్మా సినిమాతో హీరోగా మారారు. 

డిగ్రీ పూర్తి కాగానే ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన నాని.. మొదట్లో దర్శకులు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‎గా పనిచేశారు. 

 శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన రాధాగోపాలం సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అలాగే దర్శకుడు కావాలనుకున్నారట. 

అయితే సహయ దర్శకుడిగా ఉన్నప్పుడు తన జీతం కేవలం నాలుగు వేలు మాత్రమే అని.. ఆ డబ్బుతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నారట.

అష్టా చెమ్మా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు నాని. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. 

ఆ తర్వాత పిల్ల జమీందార్, అలా మొదలైంది, ఈగ, నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు.

ఇటీవలే దసరా, హాయ్ నాన్న సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు నాని.