08 February 2025

దుల్కర్ సల్మాన్ కార్ కలెక్షన్ చూస్తే ఫ్యూజుల్ అవుట్.. ఎన్ని ఉన్నాయంటే

Rajitha Chanti

Pic credit - Instagram

మలయాళంతోపాటు తెలుగులోనూ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఈహీరోకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. 

మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. ఇప్పుడు తెలుగులోనూ వరుస హిట్లతో అగ్ర కథానాయకులకు పోటీ ఇస్తున్నాడు.

మహానటి, సీతారామం సినిమాలతో హిట్స్ అందుకున్న దుల్కర్.. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో మరో హిట్ అందుకుని నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు.

అయితే దుల్కర్ సల్మాన్ వద్ద కార్ కలెక్షన్ గురించి ఇప్పుడు ఓ న్యూస్ వైరలవుతుంది. తన భార్యకు భయపడి సగం కార్లను హైదరాబాద్ లోనే వదిలేశాడట. 

దుల్కర్ సల్మాన్ వద్ద రూ.3 కోట్లు విలువైన మెర్సిడెస్-మేబాచ్ GLS600 లగ్జరీ SUV ఉంది. దీని ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.1.85 లక్షలు చెల్లించాడట. 

బ్రాండ్ న్యూ మెర్సిడెస్-బెంజ్ AMG A45 S కారును సైతం కొనుగోలు చేశాడు. ఆ కారు ధర రూ.92.50 లక్షలు. అలాగే  BMW 7-సిరీస్ లగ్జరీ సెడాన్ ఉంది. 

ఈ  BMW 7-సిరీస్ లగ్జరీ సెడాన్ కారు ధర రూ.1.78 కోట్లు అని సమాచరం. అలాగే దుల్కర్ వద్ద రూ.5.40 కోట్లు విలువైన ఫెరారీ కారును సైతం కలిగి ఉన్నాడు. 

దుల్కర్ సల్మాన్ వద్ద మొత్తం రూ.70 కార్ల వరకు ఉన్నాయట. అయితే తన భార్యకు తెలిస్తే తిడుతుందని కొన్ని కార్లు ఫ్రెండ్స్ ఇళ్లల్లో దాస్తాడట ఈ హీరో.