29 June 2025

చేసింది మూడు సినిమాలు.. ఒకటి బ్లాక్ బస్టర్.. రెండు డిజాస్టర్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

ఇటీవల కాలంలో కొందరు హీరోయిన్ తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ సైతం.

తెలుగులో ఇప్పటివరకు కేవలం మూడు సినిమాల్లో నటించింది. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరో రెండు డిజాస్టర్స్.. అయిన తగ్గని ఆఫర్స్.

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. అంతేకాదు నెట్టింట ఈ బ్యూటీకి క్రేజ్ పీక్స్ లో ఉంది. ఆమె ఎవరో తెలుసా.. ?

ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. హీరోయిన్ వైష్ణవి చైతన్య. షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోయిన్‏గా మారింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది ఈ బ్యూటీ.

బేబీ సినిమాతో హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ మూవీతోనే కుర్రకారును అలరించింది వైష్ణవి, 

ఆ తర్వాత ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన లవ్ మీ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది వైష్ణవి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

అలాగే సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ సినిమాలో మెరిసింది. ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ నటిగా మార్కులు కొట్టేసింది.

ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించిన వైష్ణవి.. ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరో రెండు డిజాస్టర్స్ అయ్యాయి. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.