దక్షిణా భారతీయ సినీరంగంలో తోపు హీరోయిన్. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది తమన్నా.
సినీరంగంలో దాదాపు 20 ఏళ్లుగా అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.
అదే ఏడాది మంచు మనోజ్ సరసన శ్రీ అనే సినిమాలో కనిపించింది. కానీ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా తమన్నాకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది.
తమన్నా ఆస్తులు రూ.120 కోట్లు. ముంబైలో విలాసంవతమైన అపార్ట్మెంట్ కలిగి ఉంది. ముంబైలోని వెర్సోవాలోని బేవ్యూ అపార్ట్‌మెంట్స్‌లో 14వ అంతస్తులో ఫ్లాట్ ఉంది.
అలాగే తమన్నా రియల్ ఎస్టేట్ లో అనేక పెట్టుబడులు పెట్టింది. ఆమె దగ్గర రూ. 43.50 లక్షల విలువైన BMW 320i, రూ. 1.02 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ GLE ఉన్నాయి.
తమన్నా కార్ల కలెక్షన్‌లో రూ. 29.96 లక్షల ధర గల మిత్సుబిషి పజెరో స్పోర్ట్, రూ. 75.59 లక్షల ధర గల ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఉన్నాయి.
ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు.. ఇప్పుడు హిందీ సినిమాల్లో స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ వయ్యారి.
ఇక కొన్నేళ్లుగా బీటౌన్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది తమన్నా. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారని అంతా అనుకున్నారు. కానీ ఈమధ్యే బ్రేకప్ జరిగింది.