22 June 2025
కోట్లు డిమాండ్ చేసి ఆఫర్స్ పోగొట్టుకుంది.. ఫాలోయింగ్ వేరేలెవల్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయన సమాచారం.
కానీ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. దీంతో ఆమెకు ఆ స్థాయిలో ఇవ్వలేమని నిర్మాతలు వెనక్కు తగ్గారని టాక్.
రెమ్యునరేషన్ పెంచడంతో ఈ హీరోయిన్ ఎన్నో ఆఫర్స్ కోల్పోయిందని ఫిల్మ్ వర్గాల్లో టాక్. కట్ చేస్తే .. ఇటీవల ఆమె నటించిన సినిమా రూ.400 కోట్లు వసూలు చేసింది.
ఆమె మరెవరో కాదండి.. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమాతో నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో హిట్ అయ్యింది.
ఆతర్వాత కేజీఎఫ్ 2 సినిమాతోనూ మరోసారి పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారింది. ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత తమిళంలోకి అడుగుపెట్టింది శ్రీనిధి. తమిళంలో విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా మూవీలో కథానాయికగా నటించింది ఈ బ్యూటీ.
కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఆమెకు ఆఫర్స్ అంతగా రాలేదు. ఇక ఇటీవలే న్యాచురల్ స్టార్ నానితో కలిసి హిట్ 3లో నటించింది.
ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.400 కోట్ల వరకు వసూలు చేసింది. తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్