30 June 2025
స్టార్ హీరోలతో సినిమాలు.. అన్నీ అట్టర్ ప్లాపే.. తగ్గని ఆఫర్స్..
Rajitha Chanti
Pic credit - Instagram
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. హీరోయిన్గా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.
ఆ తర్వాత తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ఆమె పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతుంది.
అయితే ఐదుగురు స్టార్ హీరోలతో ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
ఆమె మరెవరో కాదండి హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం ఆమె వయసు 24 సంవత్సరాలు మాత్రమే. కిస్ సినిమాతో తెరంగేట్రం చేసి ప్రశంసలు అందుకుంది.
2022లో రవితేజతో నటించిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.
కానీ ఆ తర్వాత స్టార్ హీరోలతో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
ఇప్పుడు శ్రీలీల.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. అలాగే అఖిల్ సరసన నటిస్తోన్న లెనిన్ సినిమా నుంచి తప్పుకుందట.
బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది శ్రీలీల. ఈ క్రమంలోనే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో లెనిన్ నుంచి తప్పుకుందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్