ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు.. ఇప్పుడు సమంత ఆస్తులు తెలిస్తే..
Rajitha Chanti
Pic credit - Instagram
గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు సమంత. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న సామ్ ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసుకుంది.
బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న సామ్.. డిసెంబర్ 1న లింగ భైరవి ఆలయంలో అతడితో కలిసి ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
దీంతో ఇప్పుడు సమంత, రాజ్ నిడుమోరు దంపతులకు అభిమానులు, సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు వీరిద్దరిపై పరోక్షంగా విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు సామ్ పర్సనల్ లైఫ్, ఫిల్మ్ జర్నీ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సమంత ఆస్తులు, లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందామా.
నివేదికల ప్రకారం సమంత ఆస్తులు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కానీ ఒకప్పుడు ఉన్నత చదువులు చదివేందుకు డబ్బులు లేకపోవడంతో మధ్యలోనే ఆపేసింది.
ఇప్పుడు సామ్ ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే సిటాడెల్ సిరీస్ కోసం ఆమె ఏకంగా రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుందని టాక్.
అలాగే సామ్ కేవలం ప్రకటనల ద్వారానే ఏడాదికి రూ.8 కోట్ల వరకు సంపాదిస్తుందని సమాచారం. రియల్ ఎస్టేట్, కాస్మోటిక్స్ వ్యాపారాల్లో అనేక పెట్టుబడులు పెట్టింది.
సామ్ వద్ద మెర్సిడెస్ బెంజ్ G63 AMG, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, పోర్షే కేమన్ GTS, BMW 7 సిరీస్, ఆడి Q7, జాగ్వార్ XF వంటి లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం.