01 December 2025

దర్శకుడితో సమంత పెళ్లి.. అసలు ఎవరీ రాజ్ నిడిమోరు.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ సమంత, రాజ్ నిడమోరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

తాజాగా తమ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అధికారికంగా కన్ఫార్మ్ చేసింది సామ్. ప్రస్తుతం సమంత, రాజ్ పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పెళ్లికి సమంత ఎరుపు రంగు చీర ధరించగా.. రాజ్ నిడమోరు క్రీమ్, గోల్డెన్ కలర్ షర్వానీ ధరించారు. ఈ దంపతులకు నెటిజన్స్, సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. 

ఇదెలా ఉంటే.. ఇప్పుడు సమంత భర్త రాజ్ నిడిమోరు గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అతడి గురించి నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. 

రాజ్‌ నిడిమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుకున్నారు. డైరక్టర్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

హిందీలో పలు ప్రాజెక్ట్స్ తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. రాజ్ అండ్ డీకే కాంబోలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో సమంత కీలకపాత్ర పోషించారు. 

రాజ్ కెరీర్‌ తొలినాళ్లలోనే షామాలీ డేని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లపాటు అన్యోన్యంగా ఉన్న జంట 2022లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 

ఇప్పుడు సమంత, రాజ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సామ్‌కీ, రాజ్‌కీ మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంది. రాజ్‌ 1975లో పుట్టగా, సామ్‌ 1987లో పుట్టారు.