17 September 2025

రష్మిక ఆస్తులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్.. శ్రీవల్లి తగ్గేదే లే..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది రష్మిక మందన్నా. ఈ అమ్మడు ఖాతాలో ఇప్పుడు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. 

యానిమల్, కుబేర, పుష్ప 2 వంటి చిత్రాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో, మైసా వంటి చిత్రాల్లో నటిస్తుంది.

ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 45 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు  అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఇంతకీ ఈ అమ్మడు ఆస్తులు తెలుసా.. 

కేవలం 28 సంవత్సరాల వయసులో రూ. 66 కోట్ల ఆస్తులు కలిగి ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

రష్మిక వద్ద ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ వంటి తన అద్భుతమైన కార్ కలెక్షన్ ఉంది.

ఇటీవల విక్కీ కౌశల్‌తో కలిసి నటించిన పీరియాడికల్ డ్రామా 'చావా'లో కనిపించింది. ఆమె ఒక్కో చిత్రానికి రూ. 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుంది.

ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అలాగే ఈ బ్యూటీకి ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. 

రష్మిక ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమా అప్డేట్స్, క్రేజీ ఫోటోషూట్లతో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది ఈ నేషనల్ క్రష్.