28 November 2025

55 ఏళ్ల వయసులోనూ అదే అందం.. రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ ఇదేనట..

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో సహయ నటిగా ఫుల్ బిజీగా ఉంటుంది.

ప్రస్తుతం ఆమె వయసు 55 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా..?

అందం విషయంలో రమ్యకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తారట. శరీరం, మనస్సు తేలికగా ఉంటుందట.

అలాగే రోజూ జిమ్‏కు వెళ్లి శరీరానికి సరైన వర్కవుట్స్ చేస్తుంది. రోజూ వ్యాయామాలు చేయడం, శరీరాన్ని యాక్టివ్ గా ఉంచడం వల్ల శరీరాకృతికి బాగుంటుంది.

అలాగే రోజూ సైక్లింగ్, జాగింగ్, వాకింగ్ చేయడం ఆమెకు అలవాటు. ఇది ఆమె చురుకుగా ఉండేందుకు సహయపడుతుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

అంతేకాకుండా స్క్వాట్స్, పుష్ అప్స్, గ్రిప్ బలం, శరీరాన్ని తేలికగా ఉంచేందుకు అవసరమైన వ్యాయామాలు చేస్తుంది. కోర్ రొటేషన్ వ్యాయామాలు చేస్తుంది. 

శరీరానికి నీరు చాలా అవసరం. ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేందుకు శరీరానికి అవసరమైనంత మొత్తంలో నీటిని తీసుకోవాలి. చర్మం కూడా మెరుగ్గా ఉంటుంది. 

ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగుతోపాటు తమిళ భాషలలోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. అలాగే 55 ఏళ్ల వయసులో తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది.