27 June 2024

ప్రభాస్ అందుకే ఎక్కువగా మాట్లాడరు.. డార్లింగ్ గురించి తెలుసా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ హిస్టారికల్ హిట్ టాక్‎తో దూసుకుపోతుంది. 

సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి డార్లింగ్ ఎంతో కష్టడ్డారు. 

తొలి సినిమా ఈశ్వర్ షూటింగ్ సమయంలో నన్నెవరైనా చూస్తారా? ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోగలనా ? అని భయపడిన వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. 

2002లో వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన రేంజ్ మారిపోయింది. తర్వాత వెనుదిరిగి చూడలేదు.

ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా సంపాదించుకుని అటు నార్త్ అడియన్స్ హృదయాలను గెలుచుకుని ఇప్పుడు కల్కితో ముందుకు వచ్చారు. 

విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, పరాజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా తదుపరి సినిమాపై మరింత శ్రద్ధ పెట్టడం డార్లింగ్ ప్రభాస్ పాలసీ. 

 చిరునవ్వే డార్లింగ్ ఆయుధం. మాట్లాడటం విషయంలో ముందు నుంచి ప్రభాస్ ఇంట్రోవర్ట్. మూడు నిమిషాలపాటు డార్లింగ్ మాట్లాడం చాలా అరుదనే చెప్పాలి. 

కొత్త ప్రదేశం, కొత్తవారి ముందు మాట్లాడేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ప్రభాస్. ఓపిక, క్రమశిక్షణ తన పెదనాన్న కృష్ణంరాజు నుంచి తెలుసుకున్నారు.