24 September 2024

మృణాల్ ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే.. కార్ కలెక్షన్ చూస్తే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ సమంత.

సీతారామం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. ఫస్ట్ మూవీతోనే తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకుంది.

ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఇటు హిందీలోనూ సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తుంది. 

 ప్రస్తుతం మృణాల్ హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అలాగే వరుస వెబ్ సిరీస్‏లతో సినీప్రియులను ఆకట్టుకుంటుంది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మృణాల్ నికర విలువ రూ.3.9 మిలియన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం. అంటే రూ.33 కోట్ల ఆస్తులు అన్నమాట. 

కేవలం సినిమాలే కాకుండా ప్రకటనలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ బ్రాండ్ అంబాసిడర్స్, బిజినెస్ రంగాల్లోనూ మృణాల్ సంపాదిస్తుందట. 

1992 ఆగస్ట్ 1న మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో జన్మించిన మృణాల్.. కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. 

మృణాల్ వద్ద 30 లక్షల టయోటా ఫార్చ్యూనర్, 45 లక్షల హోండా అకార్డ్‌, 2.17 కోట్ల Mercedes-Benz S-క్లాస్ లగ్జరీ సెడాన్‌ కార్లు ఉన్నాయి.