24 May 2025

మృణాల్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..? బ్యూటీ రేంజ్ మాములుగా లేదుగా..

Rajitha Chanti

Pic credit - Instagram

టెలివిజన్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టి, అందం, అభినయంతో మెప్పించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. 

2014లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది ఈ బ్యూటీ.

 హిందీలో వరుస సినిమాల్లో నటించిన మృణాల్.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది. 

ఆ తర్వాత తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కేవలం డెకాయిట్ చిత్రంలో మాత్రమే నటిస్తుంది ఈ బ్యూటీ. 

ఇక మృణాల్ ఆస్తుల విషయానికి వస్తే.. నివేదికల ప్రకారం ఆమె సంపాదన రూ.40 కోట్లకు పైగానే ఉందట. నెలకు రూ.60 లక్షల వరకు సంపాదిస్తుంది. 

సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, యాడ్స్ ద్వారా సంపాదిస్తుందట. ఒక్కో సినిమాకు దాదాపు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.

ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలోని విలాసవంతమైన ఇంటిలో నివసిస్తుంది. అళాగే ఆమె దగ్గర విలువైన లగ్జరీ కార్లు ఉన్నట్లు టాక్. 

మృణాల్ వద్ద రూ.30 లక్షలు విలువైన టయోటా ఫార్చ్యూనర్, 45 లక్షలు ధర గల హోండా అకార్డ్, 2.17 కోట్ల మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ సెడాన్ ఉన్నాయి.