26 August 2025

ఒక్క సినిమా చేయకుండానే ఈ క్రేజ్ ఏందీ అమ్మడు.. ఫాలోయింగ్ చూస్తే..

Rajitha Chanti

Pic credit - Instagram

ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్  సంపాదించుకుంది. అంతేకాదు స్టార్ హీరోలతో వరుస ఛాన్సులు అందుకుంటుంది.

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది. తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ.

అటు సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 

మరోవైపు మలయాళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం హృదయపూర్వం అనే మలయాళీ చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

డైరెక్టర్ సత్యన్ అంతికాడ్, మోహన్ లాల్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో తనకు అవకాశం వస్తుందని అసలు ఊహించలేదని పోస్ట్ చేసింది మాళవిక

ఇద్దరు లెజెండ్స్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. ఇప్పటికీ నన్ను నేను గిల్లి చూసుకుంటున్నానని తెలిపింది.

వారిద్దరూ ఊహాలకందని వ్యక్తులు అని.. డెస్టినీ అంటే ఇదేనేమో.. మిమ్మల్న చిరునవ్వులతో ముంచెత్తడానికి వస్తున్నామంటూ రాసుకొచ్చింది. 

ఇప్పటివరకు తమిళం, మలయాళం భాషలలో నటించిన మాళవిక.. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.