50 ఏళ్ల వయసులో మహేష్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. రోజూ ఆ పని చేయాల్సిందే.
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 50 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్నెస్, లుక్స్ మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకే షాకిస్తున్నాడు.
ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక నటిస్తుండగా.. సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.
తాజాగా మహేష్ బాబు ఫిట్నెస్ సీక్రెట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మహేష్ రోజూ కఠినమైన వ్యాయామాలు చేస్తారట. దాదాపు 60 నిమిషాలు ఆ సెషన్ కు కేటాయిస్తాడట.
ప్రధానంగా కార్డియో, వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్, యోగా చేస్తుంటారు. ప్రతిరోజూ దాదాపు గంటపాటు వివిధ రకాల వ్యాయామాలు చేయడంతో శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతారట.
అలాగే తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నెలల తరబడి అథ్లెట్ అధారిత శిక్షణ సెషన్ లో పాల్గొంటాడు. ఇందులో రెండు రకాల శిక్షణలు ఉంటాయని సమాచారం.
ఒక్కరోజు మిస్ చేయకుండా కచ్చితంగా పలు రకాల వ్యాయమాలు చేస్తారట మహేష్. అలాగే స్ట్రెచింగ్ వర్కవుట్ చేస్తారు. ఇది వెన్నుముక, భజాల కదలికకు ఉపయోగం.
రన్నింగ్ ఎక్కువగా చేస్తుంటారు. నిజానికి మహేష్ వేగంగా పరుగెడతారు. అలాగే ఆకు కూరలు, ఇంట్లో చేసే పదార్థాలను తీసుకుంటారు. పాల ఉత్పత్తులు అస్సలు ముట్టరు.
ప్రస్తుతం మహేష్, రాజమౌళి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.