22 May 2025

ఇండియాలో రిచెస్ట్ హీరో.. హృతిక్ రోషన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ? 

Rajitha Chanti

Pic credit - Instagram

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో వన్ ఆఫ్ ది టాప్ హీరో.

కొన్నేళ్లుగా సినీరంగంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు హృతిక్. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఇంది. 

బాలీవుడ్ గ్రీకు వీరుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2 చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది

వార్ 2 చిత్రంలో మొదటి సారి జూనియర్ ఎన్టీఆర్‏తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. హృతిక్ రోషన్ ఇప్పుడు అత్యంత ధనవంతుల నటులలో ఒకరు. 

నివేదికల ప్రకారం హృతిక్ రోషన్ ఆస్తులు రూ.3100 కోట్లు అని సమాచారం. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటులలో 3వ స్థానంలో ఉన్నారు. 

హృతిక్ రోషన్ సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ అంబాసిడర్, రియల్ ఎస్టేట్ ద్వారా అధికాంగా సంపాదిస్తున్నాడు. స్మార్ట్ పెట్టుబడులు పెట్టారు.

అలాగే హృతిక్ రోషన్ ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. వార్ 2కు రూ.48 కోట్లు తీసుకుంటున్నారు.

ఈ సినిమాతోపాటు హిందీలో క్రిష్ 4 సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం సైతం వహించనున్నారు హృతిక్. దీంతో హైప్ పెరిగింది.